పారిస్‌లోని అద్భుత కట్టడం ఈఫిల్ టవర్ ఎత్తు 20 అడుగులు పెరిగింది. ఎండలకు ఇనుప కడ్డీలు వ్యాకోచించి ఎత్తు పెరిగిందేమో అనుకునేరు. అదేంకాదు. టవర్ మీద కొత్తగా డిజిటల్ రేడియో యాంటెన్నాను నిర్వాహకులు మంగళవారం అమర్చారు. దీంతో టవర్ ఎత్తు 1,063 అడుగులకు పెరిగింది.